Pelli Chesukundam Songs - Nuvvemi Chesavu Song - Venkatesh, Soundarya, Laila with lyrics || telugu majaa
By bhanu - 1:17:00 AM
నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం
ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూప దీపం కాదా ధైర్యం
జరిగింది ఓ ప్రమాదం
ఎముంది నీ ప్రమేయం
దేహనికయిన గాయం
ఏ మందుతోనొ మాయం
విలువైన నిండు ప్రాణం
మిగిలుండడం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ
ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
పురుష శ్పర్సతోనే తొలగిపోవునంటే
ఇల్లాల దెహాలలో శిలమే ఉండదనా?
భర్తన్నవాడెవడు పురుషుడే కాదు
అనా
శీలం అంటే గుణం అనే అర్ధం
గురువింద ఈ సమాజం
పరనింద తన నైజం
తనకింద నలుపు తత్వం
గమనించలేదు సహజం
తన కళ్ళముందు ఘొరం
కాదనదు పిరికి లోకం
అన్యాయమైన తనపై మోపింది పాప
భారం
అనాటి ద్రౌపదికి
ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే కాని నీలో లేదే లోపం
0 comments